ఢిల్లీలో మానవత్వం మంటగలిసిన ఒక ఘటన.. సీసీటీవీలో దృశ్యాలు
ABN , Publish Date - Feb 03 , 2026 | 09:00 PM
మానవత్వం మంటగలిసిన ఒక ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున ఒక వ్యక్తి అకస్మాత్తుగా నేలపై కుప్పకూలిపోయాడు. స్కూటర్ పై అటుగా వచ్చిన ఇద్దరు యువకులు చేసిన పనికి సభ్యసమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఢిల్లీ, ఫిబ్రవరి 3: ఢిల్లీలోని వికాస్ నగర్ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉదయం 4 గంటల సమయంలో రోడ్డుపై కుప్పకూలాడు. CCTV ఫుటేజ్‌లో అతను నొప్పితో తడబడుతూ, కొట్టుకుంటూ కనిపిస్తున్నాడు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు అతని వైపుగా వెళ్తున్నారు. అపాయంలో కొట్టుమిట్టాడుతోన్న అతడికి సాయం చేయాల్సింది పోయి.. బాధితుడి పక్కన పడి ఉన్న అతని మొబైల్ ఫోన్‌ను దోచుకుని, జేబులు తడిమారు. CCTV కెమెరా చూసి భయపడి వెంటనే పారిపోయారు.
బాధిత వ్యక్తి గంటల తరబడి రోడ్డుపైనే పడి ఉండిపోయాడు. చివరికి మరణించాడు. ఉదయం 8 గంటల సమయంలో స్థానికులు శవాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఈ దృశ్యాలన్నీ CCTV ఫుటేజ్ కనిపించాయి.
ప్రస్తుత సమాజంలో కొందరు మనుష్యులు ఎంతగా దిగజారిపోతున్నారో చెప్పేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇక, పోలీసులు దొంగలను గుర్తించి, అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితుడు హార్ట్ అటాక్ లేదా ఎపిలెప్సీ సీజర్ వల్ల పడిపోయి, ప్రాణాలు కోల్పోయి ఉంటాడని భావిస్తున్నారు. .పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి:
హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. మంత్రికి తప్పిన ప్రమాదం
అజిత్ పవార్ అంత్యక్రియల్లో రెచ్చిపోయిన దొంగలు.. ఏడుగురి అరెస్ట్