పోస్టల్ సేవల్లో మరో కీలక అడుగు.. ‘డాక్ సేవా’, ‘డాక్ మిత్ర’ యాప్స్ ప్రారంభం
ABN , Publish Date - Aug 24 , 2026 | 08:54 PM
ఢిల్లీలో పోస్టల్ సేవలను మరింత ఆధునికంగా మార్చే దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. ‘డాక్ సేవా’, ‘డాక్ మిత్ర’ యాప్‌లతో పాటు ఆధునికీకరించిన 14 పోస్టాఫీసులను కేంద్ర మంత్రులు ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో పోస్టల్ సేవలను మరింత ఆధునికంగా.. సులభంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక కార్యక్రమాలను ప్రారంభించింది. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింథియా, డా. పెమ్మసాని చంద్రశేఖర్ ‘డాక్ సేవా’, ‘డాక్ మిత్ర’ యాప్‌లతో పాటు ఆధునికీకరించిన 14 పోస్టాఫీసులను ప్రారంభించారు. ఈ యాప్‌ల ద్వారా పార్సిల్ బుకింగ్, ఇంటి నుంచే పార్సిల్ పికప్, బ్యాంకింగ్, యూపీఐ, మనీ ఆర్డర్ వంటి పలు సేవలను ఒకే వేదికపై పొందే అవకాశం కల్పించారు. పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ డిజిటల్ మార్పులు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.
పోస్టల్ శాఖకు ఈ ఏడాది రూ.4,000 కోట్ల అదనపు ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటికే తొలి త్రైమాసికంలోనే రూ.800 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా 40 పోస్టాఫీసుల ఆధునీకరణ పూర్తయిందని, మరో 110 పోస్టాఫీసులను దశలవారీగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలోని మారుమూల ప్రాంతాల వరకూ పోస్టల్ సేవలను విస్తరించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
న్యూఢిల్లీ - పాట్నా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు లేకుండా.. దేశాభివృద్ధి ఎలా సాధ్యం: అభిజీత్ దీప్కే