Share News

శాలరీ కాలిక్యులేటర్‌ పేరుతో సైబర్‌ మోసం

ABN , Publish Date - Feb 15 , 2026 | 06:08 AM

ఎనిమిదో వేతన సంఘంలో జీతాలు పెరుగుదలపై చర్చలు ఊపందుకుంటున్న వేళ.. కొత్త సైబర్‌ మోసం ఒకటి బయట పడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లే లక్ష్యంగా...

శాలరీ కాలిక్యులేటర్‌ పేరుతో సైబర్‌ మోసం

  • 8వ పే కమిషన్‌లో పెరిగే జీతాలు లెక్కించి చెబుతామంటూ వాట్సాప్‌ మెసేజ్‌లు

  • ఓపెన్‌ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఎనిమిదో వేతన సంఘంలో జీతాలు పెరుగుదలపై చర్చలు ఊపందుకుంటున్న వేళ.. కొత్త సైబర్‌ మోసం ఒకటి బయట పడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లే లక్ష్యంగా సైబర్‌ మోసగాళ్లు రంగంలోకి దిగారు. ప్రతిపాదిత వేతన సంఘం ప్రకారం జీతం ఏమేరకు పెరుగుతుందో కచ్చితంగా అంచనా వేసి చెబుతామంటూ వాట్సా్‌పలో ఫేక్‌ మెసేజ్‌లు పెడుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కొత్త సైబర్‌ స్కామ్‌పై జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను హెచ్చరించింది.మీకు పెరిగే జీతాన్ని అంచనా వేసి చెబుతామంటూ తొలుత నేరగాళ్లు బాధితులకు వాట్సా్‌పలో మెసేజ్‌ పెడతారు. దానికి ‘8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్‌’ లేదా ‘శాలరీ రివిజన్‌ టూల్‌’ పేరుతో ఉండే ఏపీకే ఫైల్స్‌ను జతచేస్తారు. ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేస్తే.. వినియోగదారుల ఫోన్‌ సైబర్‌ క్రిమినల్స్‌ చేతిలో పెట్టినట్లే. ఆ యాప్‌ ద్వారా ఫోన్‌ యజమాని వ్యక్తిగత డేటా, బ్యాంకుల సమాచారం, ఎస్‌ఎంఎస్‌, ఓటీపీలు అన్నీ కూడా మోసగాళ్లకు చేరిపోతాయి. యజమానికి తెలియకుండానే బ్యాంకుల నుంచి నగదు బదిలీ చేస్తారు. ఇలాంటి మోసాలపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. మోసపూరిత ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసిన తర్వాత తమ ఖాతాల్లో డబ్బు పోయిందని బాధితులు ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ వాట్సాప్‌ ద్వారా ఎలాంటి ఏపీకే ఫైల్స్‌ పంపదని సైబర్‌ సంస్థలు స్పష్టం చేశాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 15 , 2026 | 06:08 AM