Share News

రైల్వే బెడ్‌షీట్లు దొంగిలించిన జంట.. ప్రశ్నిస్తే వారిచ్చిన సమాధానం ఇదే..!

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:16 PM

రైల్లో ప్రయాణించిన ఓ జంట బెడ్‌షీట్లను సూట్‌కేసులో దాచుకుని తీసుకెళ్తుండగా, రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి వారిని గమనించి ప్రశ్నించాడు. ఏంటని ఆ వ్యక్తి వారిని ప్రశ్నిస్తే.. టీసీ అదనపు చార్జీ వసూలు చేశారని, అందుకే బెడ్‌షీట్లు తీసుకున్నామని ఆ మహిళ బదులిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అడ్డంగా దొరికిపోయినా కూడా పశ్చాత్తాపం లేకుండా వ్యవహరించారంటూ ఆ జంటపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

రైల్వే బెడ్‌షీట్లు దొంగిలించిన జంట.. ప్రశ్నిస్తే వారిచ్చిన సమాధానం ఇదే..!

ఇంటర్‌నెట్ డెస్క్: రైల్లో ప్రయాణించిన ఆ జంట బెడ్ షీట్లను దొంగిలించింది. వాటిని తమ సూట్‌కేసులో దాచిపెట్టింది. ఆ మహిళ భర్త ఓ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్ ఫాంలో బెడ్‌షీట్లను తీస్తుండగా ఓ వ్యక్తి గమనించి అదేంటని వారిని అడిగారు. దానికి ఆ వ్యక్తి భార్య మొరటుగా బదులిచ్చింది. రైల్లో తాము జర్నీ చేస్తుండగా.. టీసీ తమ నుంచి అదనంగా చార్జీ వసూలు చేశారని, అందువల్లే బెడ్‌‌షీట్లను తీసి తమ సూట్‌కేసులో పెట్టుకున్నామని చెప్పింది. ‘టీసీ అదనపు చార్జీ వసూలు చేసినంతమాత్రాన అలా చేయకూడదు’ కదా అని ఆ వ్యక్తి అడగగా ఆమె మళ్లీ అలాగే బుకాయించింది. వాస్తవానికి తాము ఆ బెడ్‌షీట్లను తిరిగి ఇస్తున్నామని పేర్కొంది.


కాగా.. ఆ సమయంలో ఆ మహిళ భర్త నవ్వుతూ కనిపించాడు. వీడియో తీస్తున్న వ్యక్తిని వీడియో తీయడం ఆపాలని అతను రిక్వెస్ట్ చేశాడు. తర్వాత ఆ బెడ్‌షీట్లను ఆ మహిళ భర్త తిరిగి ఇచ్చేశాడు. వీడియో తీసిన వ్యక్తి దానిని ఎక్స్‌లో పోస్టు చేశారు. రైల్వే బెడ్‌షీట్లను ఓ జంట దొంగిలించిందని ఆయన క్యాప్షన్ రాశారు. ‘బెడ్‌షీట్లను దొంగిలించడమే కాకుండా నవ్వుతూ బుకాయిస్తున్నారు. వారు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. అయినా కూడా వారి ముఖాలపై ఏమాత్రం పశ్చత్తాపం లేదు’ అని వీడియో తీసిన వ్యక్తి ట్వీట్ చేశారు. తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు యూజర్లు ఆ జంటపై విమర్శలు చేశారు.


Also Read:

ఫార్ములా ఈ కేసు విచారణ అక్టోబర్‌ 30కి వాయిదా

విభిన్న పంటలు.. నిరంతర ఆదాయం

Updated Date - Sep 18 , 2026 | 12:20 PM