రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ కన్నుమూత
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:09 AM
లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్(97) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో...
న్యూఢిల్లీ, జూన్ 5: లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్(97) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, గురువారం ఢిల్లీలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. 1929లో ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో సుభాష్ కశ్యప్ జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నెహ్రూ కాలం నాటి మొదటి లోక్‌సభ నుంచి 9వ లోక్‌సభ వరకు.. సుమారు 37 సంవత్సరాల పాటు ఆయన పార్లమెంట్‌కు విశేష సేవలు అందించారు. 1983 నుంచి 1990 వరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 100కు పైగా పుస్తకాలను రాశారు. పద్మభూషణ్ అందుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్