Share News

టీఎంసీ విలీనం.. కాంగ్రెస్ స్పందన ఏంటంటే..

ABN , Publish Date - Jun 11 , 2026 | 05:08 PM

కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) విలీనం కానుందనే వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇటీవల సోనియా గాంధీని మమతా బెనర్జీ, రాహుల్ గాంధీని అభిషేక్ బెనర్జీ కలిసిన తర్వాత ఈ వార్తలు మొదలయ్యాయి.

టీఎంసీ విలీనం.. కాంగ్రెస్ స్పందన ఏంటంటే..
Congress TMC merger

కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) విలీనం కానుందనే వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇటీవల సోనియా గాంధీని మమతా బెనర్జీ, రాహుల్ గాంధీని అభిషేక్ బెనర్జీ కలిసిన తర్వాత ఈ వార్తలు మొదలయ్యాయి. అయితే విలీన ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ తాజాగా ఖండించింది. టీఎంసీ విలీన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపడేసింది (Congress TMC merger).


ఇరు పార్టీల నేతల మధ్య జాతీయ రాజకీయ అంశాలు, ప్రతిపక్ష ఐక్యత వంటి విషయాలే చర్చకు వచ్చాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇండియా కూటమిని బలోపేత చేయడం పైనే చర్చలు సాగినట్టు వెల్లడించారు. టీఎంసీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాగా, కాంగ్రెస్‌లో విలీన ప్రతిపాదన ఏదీ లేదని, సమావేశాల్లో విలీన అంశం అసలు చర్చకే రాలేదని టీఎంసీ వర్గాలు కూడా స్పష్టం చేశాయి (TMC merger rumours).


ప్రస్తుతం టీఎంసీ అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో పలు ఊహాగానాలు మొదలయ్యాయి (TMC crisis). పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు స్వరం వినిపించడం, పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడం వల్ల రాజకీయ వర్గాల్లో పలు చర్చలు జరుగుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..


మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 11 , 2026 | 05:08 PM