Share News

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ బహిరంగ అభిశంసన వాయిదా

ABN , Publish Date - Oct 30 , 2026 | 03:42 PM

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ‘బహిరంగ అభిశంసన’ కార్యక్రమం రేపటికి వాయిదా పడింది.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ బహిరంగ అభిశంసన వాయిదా
Public Impeachment Postponed

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ‘బహిరంగ అభిశంసన’ కార్యక్రమం రేపటికి వాయిదా పడింది. నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధికారిక నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మాక్ పార్లమెంటు నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. అయితే, నేడు రాజధానిలో ఆగకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్రువీకరించారు. ‘బహిరంగ అభిశంసన కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించేందుకు నిర్ణయించాము’ అని చెప్పారు.


జాతీయ మీడియా కథనాల ప్రకారం, మాక్ పార్లమెంటుకు మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ సారథ్యం వహించనున్నారు. మాక్ పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని ఖర్గే ప్రవేశపెడితే ఎంపీ రాహుల్ గాంధీ ముగింపు ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి తుది రూపు ఇచ్చేందుకు నిన్న ఇండి కూటమి నేతలు సమావేశమయ్యారు. ఓట్ చోరీకి నిరసనగా బహిరంగ అభిశంసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్‌తో పాటు సీనియర్ నేతలు మీరా కుమార్, టీఎంసీ నేత డెరెక్ ఓ బ్రయన్, సమాజ్‌వాదీ పార్టీ నేత హరేంద్ర మలిక్, జేఎంఎం నేత మహువా, సీపీఐ నేత జాన్ బ్రిట్టాస్ తదితరులు పాల్గొన్నారు.


రేపు జరగనున్న ‘బహిరంగ అభిశంసన’లో ఇండి కూటమి పార్టీల నుంచి ఒక్కో నేత చొప్పున ప్రసంగించనున్నారు. మరోవైపు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ప్రతిపక్ష పార్టీలు భారీ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

పూలు కోస్తూ 23వ అంతస్తు నుంచి పడి తండ్రీకొడుకు మృతి

రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ 24వ విడత నిధులు.. 9.34 కోట్ల మందికి రూ.18,680 కోట్లు!

Updated Date - Oct 30 , 2026 | 03:55 PM