మళ్లీ మొదటి నుంచి చర్చలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 05:53 AM
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) విషయంలో స్వదేశానికి ప్రధాని మోదీ చేసిన నమ్మకద్రోహం బట్టబయలైందని, ఆయన...
అమెరికా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ/ముంబై, ఫిబ్రవరి 21: అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) విషయంలో స్వదేశానికి ప్రధాని మోదీ చేసిన నమ్మకద్రోహం బట్టబయలైందని, ఆయన అమెరికాకు లొంగిపోయారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ట్రంప్ సుంకాలు చట్ట విరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మోదీపై రాహుల్‌గాంధీ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. అమెరికాతో బీటీఏ భారత్‌కు తీవ్ర ప్రతిబంధకం కానుందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. ‘తన ఇమేజ్‌ను కాపాడుకొనేందుకు ప్రధాని వెనక్కి తగ్గకుండా కనీసం 18 రోజులపాటు గట్టిగా నిలబడినా నేడు భారతీయ రైతుల ప్రయోజనాలతోపాటు దేశ సార్వభౌమత్వానికి రక్షణ ఉండేది’ అన్నారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో..ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై మళ్లీ మొదటి నుంచి చర్చలు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా, ఢిల్లీలో శుక్రవారం ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసనపై బీజేపీ కార్యకర్తలు మహారాష్ట్రలోని భీవండీలో, ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News