Share News

కాంగ్రెస్‌-బీజేపీ పోటాపోటీగా నిరసనలు

ABN , Publish Date - Jul 23 , 2026 | 05:35 AM

నీట్‌పై పార్లమెంట్‌లో చర్చించాలని, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్లతో ప్రఽధాని నివాసం ముందు...

కాంగ్రెస్‌-బీజేపీ పోటాపోటీగా నిరసనలు

న్యూఢిల్లీ, జూలై 22: నీట్‌పై పార్లమెంట్‌లో చర్చించాలని, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్లతో ప్రఽధాని నివాసం ముందు నిరసనకు దిగిన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీ తదితరులపై.. పోలీసుల దురుసు ప్రదర్శన, అరెస్టునకు నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. మరోవైపు ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్‌ నిరసనలను వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు సైతం రోడ్డెక్కాయి. దీంతో ఢిల్లీ సహా పలు నగరాలు, ముఖ్య పట్టణాలు కాంగ్రెస్‌, బీజేపీ పరస్పర ప్రదర్శనలు, ధర్నాలతో హోరెత్తిపోయాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఢిల్లీలో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత హోదాకు కళంకం తీసుకువచ్చేలా రాహుల్‌ ప్రవర్తన ఉందని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు.. హైదరాబాద్‌, తిరువనంతపురం, గువాహటి, భువనేశ్వర్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ర్యాలీలు నిర్వహించాయి.

Also Read:

కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం

గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - Jul 23 , 2026 | 05:35 AM