Share News

తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

ABN , Publish Date - Jul 01 , 2026 | 07:54 AM

హోటళ్లు, రెస్టారెంట్లు, టీస్టాల్స్ ఇతరత్రా వ్యాపారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించింది. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌పై ఏకంగా రూ. 183 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
Commercial LPG Cylinder Price Cut by Rs 183 from July 1

ఢిల్లీ, జూలై 1: హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్ తదితర వ్యాపారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించింది. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 183 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.


ఈ తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,930 కి చేరింది. గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన ధరల నుంచి వ్యాపార వర్గాలకు ఇది కాస్త ఉపశమనం. ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఈ తగ్గింపునకు అనుగుణంగానే ధరలు మారనున్నాయి. అయితే స్థానిక పన్నులు (VAT) ఆధారంగా ఒక్కో నగరంలో ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి.


ఇవి కూడా చదవండి

ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్‌: తుమ్మల

హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!

Updated Date - Jul 01 , 2026 | 08:37 AM