Share News

సీజేపీ మళ్లీ నిరసన బాట.. జెన్ జీని కేంద్రం మోసగించిందని ఆరోపణ

ABN , Publish Date - Aug 24 , 2026 | 07:11 PM

నీట్ పేపర్ లీక్‌కు నిరసనగా సంసద్ ఛలో కార్యక్రమంతో యావత్ దేశంలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ దేశరాజధానిలో మరో నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది.

సీజేపీ మళ్లీ నిరసన బాట.. జెన్ జీని కేంద్రం మోసగించిందని ఆరోపణ
CJP's March in Delhi on Sept 5

ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్‌ ఉదంతానికి వ్యతిరేకంగా ఉద్యమించి యావత్ దేశంలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ దేశరాజధానిలో మరో నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 5 ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వరకూ మార్చ్ నిర్వహిస్తామని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు. జెన్ జీని కేంద్రం మోసగించడాన్ని తాము సహించబోమని చెప్పారు. జెన్ జీని కేంద్రం మోసగించిందని ఆరోపించారు.

కేంద్రం జెన్ జీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవచ్చని తమకు దీక్ష విరమణ రోజునే అనిపించిందని సౌరవ్ దాస్ తెలిపారు. ‘జులై 25 దీక్ష విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోకపోవచ్చని నేషనల్ వర్కింగ్ కమిటీ అప్పుడే సందేహాలు వ్యక్తం చేసింది. అందుకే మరో నిరసన కార్యక్రమానికి సిద్ధమయ్యాము. ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలు, పోలీసు దౌర్జన్యానికి బాధితులుగా మిగిలిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’ అని సౌరవ్ దాస్ తెలిపారు.


అంతకుముందు సీజేపీ నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశమైన కేంద్రం జెన్ జీని మోసగించినట్టు తేల్చింది. ఎఫ్‌ఐఆర్‌ల తొలగింపు, ఆత్మహత్య చేసుకున్న బాధితులకు పరిహారం విషయంలో కేంద్రం తన మాట నిలబెట్టుకోలేదని తేల్చింది. ఈ నేపథ్యంలో మరో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించింది.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల్లో ఓటమి.. రీకౌంటింగ్‌ను కోరుతూ హైకోర్టులో స్టాలిన్ పిటిషన్

న్యూఢిల్లీ - పాట్నా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

Updated Date - Aug 24 , 2026 | 07:51 PM