త్వరలో బొగ్గు ఎక్స్ఛేంజ్.. దేశమంతా ఒకే ధరకు బొగ్గు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:21 PM
దేశవ్యాప్తంగా బొగ్గుకు ఒకే ధర ఉండేలా త్వరలో కోల్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతోందన్నారు.
ఢిల్లీ: దేశవ్యాప్తంగా బొగ్గుకు ఒకే ధర ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో కోల్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గి వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి బొగ్గు ధరలను పెంచలేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా సిమెంట్, స్టీల్ వంటి రంగాలకు సంబంధించిన ధరల విషయంలోనూ పెరుగుదలను నియంత్రించే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
మినరల్స్ అంశంలో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయబోదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పన్నులు, సెస్‌ల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదని తెలిపారు. రాష్ట్రాలకు ఉన్న హక్కులు, అధికారాలను గౌరవిస్తూనే ఖనిజ రంగ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. దేశంలో మినరల్స్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని కిషన్‌రెడ్డి తెలిపారు.
Also Read:
ఫుకెట్-న్యూఢిల్లీ ఫ్లైట్ ఉదంతంపై కేంద్రం సీరియస్!
దేశ రాజధానిలో ఆగస్టు 15 వేడుకలకు సర్వం సిద్ధం..