ఫుకెట్-న్యూఢిల్లీ ఫ్లైట్ ఉదంతంపై కేంద్రం సీరియస్!
ABN , Publish Date - Aug 13 , 2026 | 06:47 PM
ఫుకెట్-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం టర్బులెన్స్ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఘటన అనంతరం జరిపిన రక్త పరీక్షల్లో ఓ పైలట్ శాంపిల్స్‌లో గంజాయి ఉన్నట్టు బయటపడటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఫుకెట్-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం టర్బులెన్స్ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఘటన అనంతరం జరిపిన రక్త పరీక్షల్లో ఓ పైలట్ శాంపిల్స్‌లో గంజాయి ఉన్నట్టు బయటపడటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలపై పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని ఎయిర్ ఇండియాకు ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ ఘటనకు బాధ్యులైన వారు మూల్యం చెల్లించుకోకతప్పదని కూడా కేంద్రం హెచ్చరించినట్టు తెలుస్తోంది.
ఆగస్టు 4న ఓడిశా మీదుగా ప్రయాణిస్తున్న తరుణంలో విమానం తీవ్ర కుదుపులకు (టర్బులెన్స్) లోనైన విషయం తెలిసిందే. ఒక్కసారిగా 300 అడుగుల మేర కిందకు దిగిపోయింది. ఐదు నిమిషాల అనంతరం పరిస్థితి సద్దుకోవడంతో యథావిధిగా ప్రయాణించిన విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండైంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు, సిబ్బంది కూడా గాయాలపాలయ్యారు.
ఘటన అనంతరం నిర్వహించిన డోప్ పరీక్షల్లో ప్రధాన పైలట్ శరీరంలో గంజాయి ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాను డాక్టర్ల సూచన మేరకు నిద్రమాత్రలు తీసుకుంటున్నట్టు ప్రధాన పైలట్ చెప్పినట్టు సమాచారం. ఈ మాత్రల వల్లనే డ్రగ్ టెస్టులో పాజిటివ్‌గా వచ్చిందని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రయాణంలో పైలట్ ప్రవర్తన సరిగా లేదని కొందరు క్రూ చెప్పడంతో అధికారులు ఈ అంశంపైనా దృష్టిసారించారు. ఈ ఉదంతం నేపథ్యంలో డ్రగ్ టెస్టుల మార్గదర్శకాలకు తగిన మార్పులు చేయాలని ప్రభుత్వం డీజీసీఏకు సూచించింది. తప్పనిసరిగా డ్రగ్ టెస్టులు చేయించుకోవాల్సిన సిబ్బంది సంఖ్యను పెంచాలని ఆదేశించినట్టు సమాచారం. ఘటన నేపథ్యంలో విమానం పనీతీరుపై కూడా అధికారులు దృష్టిసారించారు.
ఈ వార్తలనూ చదవండి:
షాకింగ్ వీడియో వైరల్.. బెంగళూరులో ఓ మహిళ మెడలో బంగారం చోరీ..
మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..