Share News

మొదటి సారి అసెంబ్లీకి సీఎం విజయ్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం..

ABN , Publish Date - May 11 , 2026 | 11:38 AM

టీవీకే అధినేత విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

మొదటి సారి అసెంబ్లీకి సీఎం విజయ్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం..
Tamil Nadu Assembly

చెన్నై, మే 11: టీవీకే అధినేత విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌ తర్వాత మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కూడా అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ అసెంబ్లీకి కూడా సూట్‌లోనే వచ్చారు. ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ టీషర్ట్, జీన్స్ ప్యాంట్స్‌‌తో కనిపించారు.


తిరుచ్చి ఈస్ట్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా

విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీలో నిలబడ్డారు. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్‌ నుంచి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ విజయ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. రూల్ ప్రకారం ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండటంతో.. విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకున్నారు. ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందే తిరుచ్చి ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. పెరంబూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు.


ఇవి కూడా చదవండి

పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సత్కారం

సువేందు అధికారి పీఏ హత్యకేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

Updated Date - May 11 , 2026 | 11:49 AM