ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేకపోతే చర్చలకు అర్థం లేదు.. తేల్చి చెప్పిన సీజేపీ..
ABN , Publish Date - Jul 25 , 2026 | 01:53 PM
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని, అది నెరవేరకపోతే తదుపరి చర్చలకు ఎలాంటి ప్రయోజనమూ లేదని సీజేపీ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వంతో మూడో విడత చర్చలకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) తమ వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని, అది నెరవేరకపోతే తదుపరి చర్చలకు ఎలాంటి ప్రయోజనమూ లేదని ప్రకటించింది. ఈ మేరకు సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా స్పష్టం చేశారు (Dharmendra Pradhan resignation).
'ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో రాజీ ఉండదు. ప్రభుత్వం దీనికి అంగీకరించకపోతే చర్చలు కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం' అని ట్వీట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ నిరసనకారులతో రెండో విడత చర్చలు జరిపారు. శనివారం మధ్యాహ్నం మూడో విడత చర్చలు జరగబోతున్నాయి (CJP Jantar Mantar protest).
కాగా, కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని తెలుస్తోంది (NEET protest). అయితే విద్యార్థుల ఇతర డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించినప్పటికీ, సీజేపీ ఉద్యమం మాత్రం కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి..