గాయపడ్డ వారికి నడ్డా పరామర్శ
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:55 AM
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ర్యాలీపై పోలీసులు జరిపిన లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్న 23 ఏళ్ల యువతి సాక్షిని...
న్యూఢిల్లీ, జూలై 21: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ర్యాలీపై పోలీసులు జరిపిన లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్న 23 ఏళ్ల యువతి సాక్షిని మంగళవారం ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రిలో ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయానికి 186 మందిని లోహియా ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగానికి తీసుకొచ్చారని, వారిలో 89 మంది పోలీసులని, మిగిలిన వారు విద్యార్థులని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా మంగళవారం రాంమనోహర్ లోహియా, లేడీ హార్డింగ్ ఆస్పత్రులను సందర్శించి, బాధితులను పరామర్శించారు. వారి పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు. మరోవైపు, ర్యాలీ సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న పలువురు విద్యార్థుల ఆచూకీ తెలియటం లేదని వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, జంతర్‌మంతర్ వద్ద సీజేపీ నిరసన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం వేల సంఖ్యలో జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!