చైనా వీసా ఇవ్వకపోవటమే ఆమెకు మంచిదైంది.. తోటి యాత్రికులు 32 మంది..
ABN , Publish Date - Aug 28 , 2026 | 06:57 AM
కైలాశ్ మానససరోవర యాత్రకు వెళ్లాలనుకున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ చైనా వీసా ఇవ్వకపోవటంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. నేపాల్ నుంచి ఆమె లడఖ్ వెళ్లిపోయింది. ఈ నిర్ణయమే ఆమె ప్రాణాన్ని కాపాడింది.
ఇంటర్‌నెట్ డెస్క్: కైలాశ్ మానససరోవర యాత్రకు వెళ్లాలనుకున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ చైనా వీసా ఇవ్వకపోవటంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. నేపాల్ నుంచి ఆమె లడఖ్ వెళ్లిపోయింది. ఈ నిర్ణయమే ఆమె ప్రాణాన్ని కాపాడింది. చైనా వీసా ఇచ్చిన 32 మంది పశ్చిమ బెంగాల్ యాత్రికులు నేపాల్ వరదల్లో గల్లంతయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దాదాపు 33 మంది మానససరోవర యాత్ర కోసం నేపాల్ వెళ్లారు. చైనా వీసా కోసం ప్రయత్నించారు. వీరిలో 32 మందికి చైనా వీసా ఇచ్చింది.
తిపతి సింఘా అనే 61 ఏళ్ల మహిళకు వీసా ఇవ్వలేదు. దీంతో ఆమె నేపాల్ నుంచి లడఖ్ పర్యటనకు వెళ్లిపోయారు. చైనా వీసా రాకపోవటమే ఆమెకు వరంగా మారింది. తిపతి నేపాల్‌నుంచి లడఖ్ వెళ్లిన మరుసటి రోజు ( బుధవారం) ఉదయం 9 గంటల ప్రాంతంలో ఉద్ధృతంగా ప్రవహించిన భోటేకోశీ నది నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. టిబెట్ వైపు నుంచి వచ్చిన మెరుపు వరదల కారణంగా పలు ఊళ్లు, బ్రిడ్జ్‌లు, ప్రాజెక్ట్‌లు నీటిలో కొట్టుకుపోయాయి. చైనా వీసా ఇచ్చిన 32 మంది పశ్చిమ బెంగాల్ యాత్రికులు గల్లంతయ్యారు.
ఈ సంఘటనపై తిపతి మీడియాతో ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘మే నెల నుంచి కైలాశ్ మానససరోవర యాత్రకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాను. చైనా నాకు వీసా ఇవ్వలేదు. వీసా ఇవ్వకపోవడానికి సరైన కారణం కూడా చెప్పలేదు. నాకు చాలా బాధేసింది. నిరాసతో నా ప్లాన్‌ను మార్చుకున్నాను. లడఖ్ పర్యటనకు వెళ్లిపోయాను. నేపాల్‌లో వరదలు వచ్చాయని తెలిసింది. లడఖ్ పర్యటనను మధ్యలోనే ముగించాను. కోల్‌కతాకు తిరిగి వస్తున్నాను. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
దిగొస్తున్న బంగారం, వెండి ధరలు..
అర్థం చేసుకునేవాళ్లు దొరికితేనే రెండో పెళ్లి