బ్రిక్స్ విందుకు చైనా ప్రతినిధిగా విదేశాంగ మంత్రి వాంగ్ యీ
ABN , Publish Date - Sep 13 , 2026 | 08:37 PM
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని మోదీ భారత్ మంటపంలో ఇచ్చిన గాలా డిన్నర్‌కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకాకపోవడంపై పలు ఊహాగానాలు రేగాయి. అయితే, చైనా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ హాజరయ్యారని భారత దౌత్య వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ, సెప్టెంబర్ 13: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి భారత్ మంటపంలో విదేశీ నేతలకు 'గాలా డిన్నర్' ఇచ్చారు. ఈ విందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకాకపోవడం మీద రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. అయితే, చైనా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ హాజరయ్యారని భారత దౌత్య వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఈ విందుకు ముందే ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ల నడుమ అత్యంత కీలకమైన ద్వైపాక్షిక సమావేశం జరిగింది. భారత్-చైనా సరిహద్దు సమస్యలకు న్యాయమైన పరిష్కారం కనుగొనాలని, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని ఇరునేతలు నిర్ణయించారు. ద్వైపాక్షిక చర్చలు ముగిసిన అనంతరం, వ్యక్తిగత షెడ్యూల్ ప్రాధాన్యతల దృష్ట్యా జిన్‌పింగ్ హోటల్‌కు వెళ్లారని, ఆయన స్థానంలో దౌత్య ప్రోటోకాల్ ప్రకారం విదేశాంగ మంత్రి వాంగ్ యీ విందుకు హాజరయ్యారని భారత విదేశాంగ శాఖ (MEA) వర్గాలు తెలిపారు.
అంతర్జాతీయ సదస్సుల్లో దేశాధినేతల షెడ్యూల్స్ ఆధారంగా విదేశాంగ మంత్రులు విందుల్లో పాల్గొనడం సర్వసాధారణమని, మోదీ-జిన్‌పింగ్ చర్చలు ఎంతో సానుకూలంగా సాగాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి: మోదీ
‘రా రా కన్నా’.. కొడుకు కోసం నదీ తీరంలో ఓ తల్లి నిరీక్షణ