Share News

భారత్‌ ఆకాంక్షలను గౌరవిస్తాం: చైనా

ABN , Publish Date - Feb 12 , 2026 | 06:19 AM

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎ్‌ససీ)లో శాశ్వత సభ్యత్వం కోసం ఇప్పటివరకూ భారత్‌ ప్రయత్నాలకు మోకాలడ్డిన చైనా స్వరం మార్చింది. ఈ విషయంలో...

భారత్‌ ఆకాంక్షలను గౌరవిస్తాం: చైనా

  • భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎ్‌ససీ)లో శాశ్వత సభ్యత్వం కోసం ఇప్పటివరకూ భారత్‌ ప్రయత్నాలకు మోకాలడ్డిన చైనా స్వరం మార్చింది. ఈ విషయంలో భారతదేశ ఆకాంక్షలను తాము అర్థం చేసుకున్నామని, వాటిని గౌరవిస్తామని తెలిపింది. అలాగే భారత్‌ అధ్యక్షతన జరగబోయే బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశానికి పూర్తి మద్దతు ప్రకటించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీతో ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం సందర్భంగా చైనా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఫారిన్‌ మినిస్టర్‌ (ఈవీఎ్‌ఫఎం) మా జావ్‌షు ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ నెల 8 నుంచి 10 వరకూ జరిగిన బ్రిక్స్‌ షెర్పా సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన భారత్‌ వచ్చారు.

ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌‌కు బండి సంజయ్ సూటిప్రశ్న

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 06:19 AM