Share News

డీఎంకేకు తెలిపే టీవీకేకు మద్దతు ఇచ్చాం!

ABN , Publish Date - Jun 08 , 2026 | 05:48 AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం డీఎంకే నాయకత్వానికి చెప్పిన తర్వాతే టీవీకే ప్రభుత్వానికి...

డీఎంకేకు తెలిపే టీవీకేకు మద్దతు ఇచ్చాం!

కాంగ్రెస్‌ నేత చిదంబరం వెల్లడి

చెన్నై, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం డీఎంకే నాయకత్వానికి చెప్పిన తర్వాతే టీవీకే ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ప్రకటించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం తెలిపారు. ఆదివారం ఓ ప్రైవేట్‌ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం టీవీకేకు లేదని గమనించి, ఒక వేళ ఆ పార్టీకి అసెంబ్లీలో బలం తగ్గితే మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ప్రమాదం ఉందని భావించే కాంగ్రెస్‌ సభ్యులు మద్దతు ప్రకటించారని చిదంబరం తెలిపారు. అయితే, డీఎంకే మిత్రపక్షాలు టీవీకేకు మద్దతు ప్రకటించడానికి ఒక రోజు ముందుగా తమ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించిందని వివరించారు.

ఇవి కూడా చదవండి:

టీజీ 20 లీగ్: మెదక్‌కు తిలక్ వర్మ.. ఎంత ధర పలికాడంటే?

టీ20 కెప్టెన్సీపై స్పందించిన శ్రేయస్ అయ్యర్

Updated Date - Jun 08 , 2026 | 05:48 AM