75 సీఆర్పీఎఫ్ జవాన్ల హత్య కేసులో నిందితులంతా నిర్దోషులే: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు
ABN , Publish Date - May 08 , 2026 | 04:34 AM
దేశంలో అత్యంత తీవ్రమైన నక్సల్స్ దాడుల్లో ఒకటిగా నిలిచిపోయిన తాడ్‌మెట్ల మెరుపుదాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 10 మంది నిందితులను...
బిలా్‌సపూర్, మే 7: దేశంలో అత్యంత తీవ్రమైన నక్సల్స్ దాడుల్లో ఒకటిగా నిలిచిపోయిన తాడ్‌మెట్ల మెరుపుదాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 10 మంది నిందితులను నిర్దోషులుగా ఛత్తీ్‌సగఢ్ హైకోర్టు ప్రకటించింది. 2010 ఏప్రిల్ 6న ఛతీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఉన్న తాడ్‌మెట్ల గ్రామం వద్ద 62వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లపై నక్సలైట్లు మెరుపు దాడి చేయగా.. 75 మంది జవాన్లు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 10 మందిని అరెస్టు చేశారు. అయితే, దర్యాప్తులో లోపాలున్నాయని, సరైన సాక్ష్యాలు లేవన్న కారణంతో ట్రయల్‌కోర్టు 2013 జనవరి 7న వారిని నిర్దోషులుగా ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లగా, చీఫ్ జస్టిస్ రమేశ్ సిన్హా, జస్టిస్ రవీంద్రకుమార్ అగ్రవాల్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 75 మంది జవాన్లు మరణించటం చాలా బాధాకరమైన విషయమే అయినా.. పోలీసుల దర్యాప్తులో లోపాలున్నాయని అభిప్రాయపడింది. సందేహాలనే ఆధారాలుగా చూ పటం చెల్లదని పేర్కొంటూ.. నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత
డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
Read Latest National News And Telugu News