Share News

మహిళను చంపి.. శరీర భాగాలతో బిర్యానీ!

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:53 AM

నెల మొదట్లో చెన్నై నుంచి ఆగ్రాకు వెళ్లిన రైలులో ఓ సూట్‌కేసులో మహిళ శరీర భాగాలను గుర్తించిన కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి...

మహిళను చంపి.. శరీర భాగాలతో బిర్యానీ!

  • హత్య తర్వాత చెన్నై నుంచి ఆగ్రాకు రైల్లో పార్సిల్‌

  • ‘ఎరుపు సూట్‌కేసు’ కేసును ఛేదించిన పోలీసులు

  • నిందిత జంట కోసం గాలింపు చర్యలు

చెన్నై, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఈ నెల మొదట్లో చెన్నై నుంచి ఆగ్రాకు వెళ్లిన రైలులో ఓ సూట్‌కేసులో మహిళ శరీర భాగాలను గుర్తించిన కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి భయానక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు అనుమానితులు చెన్నైలో వారు అద్దెకు తీసుకున్న ఇంట్లోనే మహిళను హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఉంటారని ప్రాథమికంగా తేలింది. శుక్రవారం ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. కొన్ని శరీర భాగాలు బిర్యానీ వండేందుకు ఉపయోగించే పెద్ద పాత్రలో ఉండడాన్ని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఆ ఇల్లంతా రక్తపు మరకలు ఉండడాన్ని గుర్తించారు. ఆ వంట పాత్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని ఆధారాల కోసం ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఇది మరణానికి గల కారణం, జరిగిన తీరుకు సంబంధించి మరిన్ని ఆధారాలు అందిస్తుందని భావిస్తున్నారు. ఇద్దరు అనుమానితులు ఓ పురుషుడు, మరో మహిళ ఆ ఎరుపు రంగు సూట్‌కేసును చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లోకి తీసుకువెళుతూ, ఆ తర్వాత ఆగ్రాకు వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రె్‌సలో దానికి వదిలేయడాన్ని సీసీటీవీ ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తులో వారిద్దరు అద్దెకు ఉంటున్న చెన్నై శివారులోని గుడువాంజేరి ప్రాంతంలోని ఇంటిని గుర్తించారు. ఈ నెల 6న చెన్నై నుంచి ఆగ్రా రైల్వేస్టేషన్‌కు వచ్చిన రైలు జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లో ఓ అనుమానాస్పద ఎరుపు రంగు బ్యాగ్‌ను రైల్వే అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఆగ్రా పోలీసులు బ్యాగ్‌ను తెరవగా.. అందులో కుళ్లిపోయిన స్థితిలో తల లేని మానవ శరీర భాగాలు కనిపించాయి. ఆ తర్వాత దీనిపై చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై రైల్వేస్టేషన్‌లో సూట్‌కేసును వదిలివెళ్లిన తర్వాత ఇద్దరు అనుమానితులు ఎక్కడకు వెళ్లారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రైల్వేస్టేషన్‌, సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. హత్యకు గురైన మహిళ ఒడిశాకు చెందిన హయ్యద్‌ నిషాగా, నిందిత జంటను అసోంకు చెందిన రాహుల్‌, ఒడిశాకు చెందిన భగవతిమాజీ పోలీసులు గుర్తించారు. అయితే మహిళ హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 05:53 AM