Share News

సొరంగంలోకి నీరు, మట్టి.. 10 మంది కార్మికుల ఆచూకీ గల్లంతు..

ABN , Publish Date - Aug 13 , 2026 | 09:35 PM

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోకి ఒక్కసారిగా భారీగా నీరు, మట్టి, రాళ్లు ప్రవేశించడంతో పలువురు కార్మికులు లోపల చిక్కుకుపోయారు. మొత్తం 18 మంది కార్మికులు సొరంగంలో పనిచేస్తుండగా, ఇప్పటివరకు 8 మందిని రక్షించారు.

సొరంగంలోకి నీరు, మట్టి.. 10 మంది కార్మికుల ఆచూకీ గల్లంతు..
Chamoli Tunnel Accident

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోకి ఒక్కసారిగా భారీగా నీరు, మట్టి, రాళ్లు ప్రవేశించడంతో పలువురు కార్మికులు లోపల చిక్కుకుపోయారు. మొత్తం 18 మంది కార్మికులు సొరంగంలో పనిచేస్తుండగా, ఇప్పటివరకు 8 మందిని రక్షించారు. మరో 10 మంది లోపల చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు (Chamoli Tunnel Accident).


చమోలి జిల్లాలోని పీపల్‌కోటిలో టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (THDC) ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. సొరంగంలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా భారీగా నీరు లోపలికి ప్రవేశించింది. నీటి ఉద్దృతికి కొంతమంది కార్మికులు సొరంగం ప్రవేశద్వారం వైపు కొట్టుకువచ్చారు. మరికొందరు లోపలే చిక్కుకుపోయారు. నీటితో పాటు మట్టి, రాళ్లు కూడా భారీగా సొరంగం లోపలికి రావడంతో సహాయక చర్యలకు సవాళ్లు ఎదురవుతున్నాయి (Chamoli Workers Trapped).


సొరంగంలో పనిచేస్తున్న 18 మందిలో ఇప్పటివరకు 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు (Tunnel Rescue Operation). మరో 10 మంది ఇంకా సొరంగంలోనే చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వారి కోసం సహాయక బృందాలు వేగంగా చర్యలు చేపడుతున్నాయి. కార్మికులను రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం (NDRF), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (SDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

మావోయిస్టు క్యాంప్‌ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..


మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..

Updated Date - Aug 13 , 2026 | 09:41 PM