యాపిల్ పండ్లకు నారింజలతో పోలికా?
ABN , Publish Date - Sep 03 , 2026 | 06:19 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన వృద్ధిరేటు మోదీ సర్కారు చెబుతున్నట్టుగా 7.8ు కాదని.. వాస్తవ వృద్ధి రేటు దాదాపు 2.6ు మాత్రమేనంటూ...
జీడీపీ వృద్ధిరేటుపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్రం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన వృద్ధిరేటు మోదీ సర్కారు చెబుతున్నట్టుగా 7.8ు కాదని.. వాస్తవ వృద్ధి రేటు దాదాపు 2.6ు మాత్రమేనంటూ విపక్షాలు, మాజీ అధికారులు చేస్తున్న విమర్శలను కేంద్రం తోసిపుచ్చింది. విమర్శకులు పాత బేస్ ఇయర్ (2011-12) లెక్కలను.. మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన 2022-23 బేస్ ఇయర్ లెక్కలతో పోల్చారని పేర్కొంది. ఇలా వేర్వేరు బేస్ ఇయర్ల లెక్కలను పోల్చడం యాపిల్ పండ్లను నారింజలతో పోల్చడమేనని కేంద్ర గణాంకాల శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ వ్యాఖ్యానించారు. 2011-12 బేస్ ఇయర్ ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మన దేశ జీడీపీ విలువ రూ.86.05 లక్షల కోట్లుగా వచ్చింది. కానీ, కొత్త బేస్ ఇయర్ (2022-23) ప్రకారం.. అదే కాలానికి జీడీపీ విలువ రూ.80 లక్షల కోట్లు అయ్యింది. దాంతో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికంలో జీడీపీ విలువ రూ.88.3 లక్షల కోట్లుగా వచ్చింది. దీంట్లోంచి ద్రవ్యోల్బణం (2.5ు) తీసేస్తే వృద్ధి రేటు 7.8 శాతం అయ్యింది. కానీ.. విమర్శకులు ఈ ఏడాది జీడీపీ విలువనేమో కొత్త బేస్ ఇయర్ లెక్కలతో పోల్చి.. గత ఏడాది జీడీపీ విలువనేమో 2011-12 బేస్ ఇయర్ లెక్కలతో పోలుస్తున్నారని.. అందుకే 2.6 శాతంగా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..