Share News

రేపు మరోసారి సీజేపీ నేతలతో చర్చిస్తాం: జేపీ నడ్డా

ABN , Publish Date - Jul 24 , 2026 | 03:54 PM

కాక్రోచ్ జనతా పార్టీ నేతలతో భేటీ అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయని తెలిపారు.

రేపు మరోసారి సీజేపీ నేతలతో చర్చిస్తాం: జేపీ నడ్డా
CJP protest

న్యూఢిల్లీ, జులై 24: కాక్రోచ్ జనతా పార్టీ నేతలతో భేటీ అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయని తెలిపారు. సీజేపీ నేతలు తమ ముందు మూడు ముఖ్యమైన డిమాండ్లను ఉంచారని వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంపై రేపు(శనివారం) మధ్యాహ్నం మరోసారి వారితో చర్చలు జరుపుతామని అన్నారు.


ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు..

శుక్రవారం మధ్యాహ్నం కాన్‌స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కేంద్ర మంత్రులు, సీజేపీ నేతల మధ్య దాదాపు రెండు గంటలు చర్చలు జరిగాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. అలా కాకపోతే ఆయనను పదవి నుంచి తొలగించాలని సీజేపీ నేతలు పట్టుబట్టారు.


చర్చల అనంతరం సీజేపీ నేత అశుతోష్ రంక మీడియాతో మాట్లాడుతూ.. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం ఓ రోజు సమయం అడిగింది. ప్రభుత్వం ఆయనను త్వరగా విధులనుంచి తొలగిస్తుందని అనుకుంటున్నాము. కేంద్రం మా రెండు డిమాండ్లకు ఒప్పుకుంది. పేపర్ లీక్ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వడానికి, విద్యార్థులపై కేసులను విత్ ‌డ్రా చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఆసియా క్రీడలు: క్రికెట్ షెడ్యూల్ విడుదల.. నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి టీమిండియా

ఫిల్టర్ కాఫీ Vs ఇన్‌స్టంట్ కాఫీ.. ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా?

Updated Date - Jul 24 , 2026 | 04:20 PM