Share News

ఫిల్టర్ కాఫీ Vs ఇన్‌స్టంట్ కాఫీ.. ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా?

ABN , Publish Date - Jul 24 , 2026 | 03:47 PM

ఫిల్టర్ కాఫీ, ఇన్‌స్టంట్ కాఫీలలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం..

ఫిల్టర్ కాఫీ Vs ఇన్‌స్టంట్ కాఫీ.. ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా?
Filter Coffee Vs Instant Coffee

ఇంటర్నెట్ డెస్క్: ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగితేనే రోజు ప్రారంభమైనట్టుగా భావించే వారు చాలా మంది ఉంటారు. కొందరికి ఫిల్టర్ కాఫీ అంటే ఇష్టం.. మరికొందరు ఇన్‌స్టంట్ కాఫీని ఇష్టపడతారు. అయితే ఈ రెండు రకాల కాఫీల్లో ఏది ఆరోగ్యానికి మంచిది? అనే విషయం గురించి తెలుసుకుందాం..


ఫిల్టర్ కాఫీ

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఫిల్టర్ కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను రక్షించడంలో సహాయపడతాయి. అలాగే వాపు (Inflammation) తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. కాఫీ గింజల్లో ఉండే కాఫెస్టాల్ (Cafestol) అనే సహజ నూనె రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగడానికి కారణమవుతుంది. కానీ ఫిల్టర్ కాఫీ తయారుచేసేటప్పుడు ఉపయోగించే ఫిల్టర్ పేపర్ ఈ నూనెలను ఎక్కువగా అడ్డుకుంటుంది. దీంతో శరీరానికి ఉపయోగకరమైన పదార్థాలు ఎక్కువగా అందే అవకాశం ఉంటుంది.


ఇన్‌స్టంట్ కాఫీ

ఇన్‌స్టంట్ కాఫీ తయారు చేసుకోవడం చాలా సులభం కావడంతో చాలామంది రోజులో ఎక్కువసార్లు తాగే అవకాశం ఉంటుంది. దీంతో కెఫిన్ అధికంగా తీసుకునే ప్రమాదం ఉంటుంది. ప్రాసెసింగ్ సమయంలో కాఫీలోని కొన్ని ప్రయోజనకరమైన పదార్థాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, మితంగా తీసుకుంటే ఇన్‌స్టంట్ కాఫీని కూడా ఆస్వాదించవచ్చు. రోజుకు ఎంత మోతాదులో తీసుకుంటున్నామన్నదే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?

ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!

Updated Date - Jul 24 , 2026 | 03:53 PM