Share News

ఈ-20 ఇంధనం ‘ప్రయోగం’ కాదు!

ABN , Publish Date - Jul 02 , 2026 | 06:09 AM

ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌(ఈ-20)ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించినట్టు వైరల్‌ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది..

ఈ-20 ఇంధనం ‘ప్రయోగం’ కాదు!

  • సుప్రీంకోర్టుకు చెప్పిన మాటను

మీడియా వక్రీకరించింది: కేంద్రం

న్యూఢిల్లీ, జూలై 1: ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌(ఈ-20)ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించినట్టు వైరల్‌ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ-20 పెట్రోల్‌పై సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్‌ చేసిన వాదనను వక్రీకరించి సోషల్‌ మీడియా సహా కొన్ని పత్రికల్లో ప్రచారం చేస్తున్నారని, కానీ, ఇది అవాస్తవమని కొట్టిపారేసింది. ‘‘20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ను కేంద్రం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. వచ్చే ఏడాది ఈ విధానంపై పూర్తి స్పష్టత వస్తుంది.’’ అని జరుగుతున్న ప్రచారం సరికాదని తెలిపింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. వాదనల్లో ఎక్కడా ఈ-20 పెట్రోల్‌ ఒక ప్రయోగాత్మక చర్య అని సుప్రీంకోర్టుకు వివరించలేదని తెలిపింది. ఈ-20 పెట్రోల్‌ వల్ల వాహనాల ఇంజన్లు పాడయ్యాయన్న కేసులు ఎక్కడా నమోదు కాలేదని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్

మెదక్ జిల్లాలో విషాద ఘటన.. పాము కాటుకు భార్య మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భర్త

Updated Date - Jul 02 , 2026 | 06:09 AM