అనంత్‌నాగ్ ఉగ్రదాడి ఘటన.. వెలుగులోకి సీసీటీవీ ఫుటేజీ..
ABN , Publish Date - Jul 22 , 2026 | 09:19 PM
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్‌నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉగ్రవాది పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఆశిఖ్ హుస్సేన్ ఖురేషీపై కాల్పులు జరిపిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆశిఖ్ హుస్సేన్ ఖురేషీ మార్కెట్‌లోనుంచి బయటకు వచ్చిన వెంటనే ఉగ్రవాది వెనుక నుంచి కాల్పులు జరిపాడు. దీంతో ఆశిఖ్ ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడు. మరో వీడియోలో.. ఉగ్రవాది రోడ్డుపై తుపాకితో పరుగులు తీస్తున్న దృశ్యాలు ఉన్నాయి.
బాధ్యత తీసుకున్న ది రెసిస్టన్స్ ఫ్రంట్..
బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో అనంత్‌నాగ్‌లోని లాల్‌చౌక్‌లో అమరనాథ్ యాత్ర సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ ఆశిఖ్ హుస్సేన్ ఖురేషీపై ఉగ్రవాది కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ ఖురేషీని అనంత్‌నాగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. ఖురేషీని పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ‘ది రెసిస్టన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)’ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. దాడికి పాల్పడ్డ టెర్రరిస్టు కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇవి కూడా చదవండి
ఎల్ నినోతో విద్యుత్ వినియోగం పెరిగింది: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఛార్లెట్‌లో తానా ఆదర్శవంతమైన సేవ.. రక్తదానం చేసిన సభ్యులు