సుభాష్‌చంద్రపై సీబీఐ కేసు
ABN , Publish Date - Sep 06 , 2026 | 05:56 AM
భారీగా అప్పులు తీసుకొని చేతులెత్తేసిన జీ ఎంటర్‌టెయిన్‌మెంట్ వ్యవస్థాపకుడు, ఎస్సెల్ గ్రూపు చైర్మన్ సుభాష్‌చంద్రకు సంబంధించిన మరో అక్రమ వ్యవహారం...
ఎల్‌ఐసీ హౌసింగ్ కంపెనీకి రూ.980 కోట్ల
రుణాలు ఎగ్గొట్టినట్లు ఎఫ్‌ఐఆర్ భారీగా ఆస్తులున్నాయని
తప్పుడు పత్రాలు సమర్పించి రుణాలు తీసుకున్న సుభాష్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: భారీగా అప్పులు తీసుకొని చేతులెత్తేసిన జీ ఎంటర్‌టెయిన్‌మెంట్ వ్యవస్థాపకుడు, ఎస్సెల్ గ్రూపు చైర్మన్ సుభాష్‌చంద్రకు సంబంధించిన మరో అక్రమ వ్యవహారం బయటపడింది. తనకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లుగా ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు పత్రాలు సమర్పించి, వాటి ఆధారంగా అప్పులు తీసుకొని ఆ సంస్థకు ఎగనామం పెట్టాడని వెల్లడైంది. ఈ మేరకు సుభాష్‌చంద్రపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. వసంత్‌సాగర్ ప్రాపర్టీస్, పాన్ ఇండియా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అనే సంస్థలకు ఎల్‌ఐసీ 2018లో మార్చిలో రూ.500 కోట్ల రుణం ఇచ్చింది. ఈ సంస్థలకు సుభాష్‌చంద్ర గ్యారెంటార్‌గా ఉన్నారు. అప్పుడు తన నికర ఆస్తుల విలువ రూ.59,113 కోట్లని పేర్కొన్నారు. అయితే, రుణాలను చెల్లించకపోవడంతో జరిగిన విచారణలో 2024 నాటికి తన ఆస్తుల విలువ రూ.31.79 కోట్లు మాత్రమేనని చెప్పారు. ఈ వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి
మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్’ నోటీసులు
సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగిస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్