Share News

UGC: యూనివర్సిటీల్లో కులవివక్ష తీవ్రం!

ABN , Publish Date - Jan 19 , 2026 | 03:57 AM

విశ్వవిద్యాలయాల్లో కుల రక్కసి బుసలు కొడుతోంది. ఐదేళ్ల వ్యవధిలో యూనివర్సిటీలు, కాలేజీల్లో కుల ఆధారిత వివక్ష ఫిర్యాదులు...

UGC: యూనివర్సిటీల్లో కులవివక్ష తీవ్రం!

  • ఐదేళ్లలో 118 శాతం పెరిగిన ఫిర్యాదులు..యూజీసీ వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 18: విశ్వవిద్యాలయాల్లో కుల రక్కసి బుసలు కొడుతోంది. ఐదేళ్ల వ్యవధిలో యూనివర్సిటీలు, కాలేజీల్లో కుల ఆధారిత వివక్ష ఫిర్యాదులు 118.4ు పెరిగాయి. ఈ మేరకు యూజీసీ పార్లమెంటరీ ప్యానెల్‌ సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019-20లో నమోదిత ఘటనలు 173 ఉండగా.. ఆ సంఖ్య 2023-24 నాటికి 378కి పెరిగింది. 2019-20, 2023-24 మధ్య 704 విశ్వవిద్యాలయాలు, 1,553 కాలేజీల్లోని ఈక్వల్‌ ఆపర్చునిటీ సెల్స్‌ (ఈవోసీ), ఎస్సీ/ఎస్టీ విభాగాల నుంచి యూజీసీకి 1,160 ఫిర్యాదులు అందగా.. వీటిల్లో 1,052 ఫిర్యాదులను (90.68ు) పరిష్కరించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ మధ్య కాలంలో పెండింగ్‌ కేసుల సంఖ్య 18 నుంచి 108కి పెరిగాయని యూజీసీ డేటా వెల్లడించింది. ఎస్సీ/ఎస్టీ, ఈవోసీ విభాగాల పనితీరుపై విద్యార్థుల్లో అవగాహన పెరగడమే ఫిర్యాదుల పెరుగుదలకు కారణమని యూసీజీ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ విభాగాలు కేసులను చురుగ్గా పరిష్కరిస్తున్నాయన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 03:57 AM