Share News

చలామణీలో నగదు ఫుల్లు..కానీ, ఏటీఎంలు నిల్లు

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:04 AM

దేశంలో చలామణిలో ఉన్న నగదు రికార్డు స్థాయికి చేరినప్పటికీ.. ఏటీఎం కేంద్రాల్లో నగదు కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా అటు గ్రామీణ...

చలామణీలో నగదు ఫుల్లు..కానీ, ఏటీఎంలు నిల్లు

న్యూఢిల్లీ, జూన్‌ 5: దేశంలో చలామణిలో ఉన్న నగదు రికార్డు స్థాయికి చేరినప్పటికీ.. ఏటీఎం కేంద్రాల్లో నగదు కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా అటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంతాల్లో నగదు విత్‌ డ్రా చేసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల నుంచి ఏటీఎంలలో నగదు లోడింగ్‌ భారీగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో దేశవ్యాప్తంగా ఏటీఎంలలో ఉంచేందుకు రూ.94 వేల కోట్ల చొప్పున అవసరమని అంచనా వేయగా.. మార్చిలో రూ.61 వేల కోట్లు (64ు), ఏప్రిల్‌లో రూ.54 వేల కోట్లు (57ు) మాత్రమే సమకూరాయి. ఆర్‌బీఐ తాజా బులెటిన్‌ మేరకు.. మే 22 నాటికి దేశంలో రికార్డు స్థాయిలో రూ.42.54 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండగా.. ఏటీఎం లావాదేవీలు మాత్రం గతేడాదితో పోలిస్తే 10.4 శాతం తగ్గాయి. ప్రజలు డిజిటల్‌ చెల్లింపుల వైపు మళ్లడంతో ఏటీఎంల లావాదేవీలు పడిపోయినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

కీలక వడ్డీరేట్లు యథాతథం.. రెపో రేటులో ఎలాంటి మార్పు లేదన్న ఆర్బీఐ

వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా..

Updated Date - Jun 06 , 2026 | 05:04 AM