Share News

వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా..

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:02 AM

దేశంలో బంగారం ధరలు మరోసారి తగ్గాయి. వెండి ధరలో కూడా కోత పడింది. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా..
Gold, Silver Rates in India on Jun 5

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధరల్లో పతనం కొనసాగుతోంది. గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలో నేడు కూడా స్వల్ప స్థాయిలో కొత పడింది. అయితే, కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటున్న వెండి ధర మాత్రం నేడు తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (జూన్ 5) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,730కు పడిపోయింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే ధరలో రూ.380ల మేర కోత పడింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.350ల మేర తగ్గి రూ.1,42,750కు చేరుకుంది. ఇక నగరంలో కిలో వెండి ధరలో రూ.5 వేల మేర కోత పడింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.8 లక్షలుగా ఉంది. విజయవాడలో కూడా దాదాపు ఇవే రేట్స్ ఉన్నాయి.


ఇక దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర సగటున రూ.350ల మేర తగ్గింది. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,57,960గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,300గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,730గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,42,750గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,55,880గా, 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,42,900గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల పసిడి ధర 4,444 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 72 డాలర్ల వద్ద కొనసాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

మదుపర్ల అప్రమత్తత.. ఆర్‌బీఐ పాలసీ ప్రకటనకు ముందు సెన్సెక్స్ ఊగిసలాట

తొలి ట్రిలియనీర్‌గా మస్క్‌!

Updated Date - Jun 05 , 2026 | 11:10 AM