Share News

తొలి ట్రిలియనీర్‌గా మస్క్‌!

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:01 AM

ప్రపంచ కుబేరుడు, అమెరికన్‌ విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మరిం త ధనవంతుడు కాబోతున్నాడు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ డేటా ప్రకారం...

తొలి ట్రిలియనీర్‌గా మస్క్‌!

స్పేస్‌ఎక్స్‌ రూ.7.20 లక్షల కోట్ల ఐపీఓతో

లక్ష కోట్ల డాలర్లు దాటనున్న ప్రపంచ కుబేరుడి సంపద

న్యూయార్క్‌: ప్రపంచ కుబేరుడు, అమెరికన్‌ విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మరిం త ధనవంతుడు కాబోతున్నాడు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ డేటా ప్రకారం ప్రస్తుతం 72,600 కోట్ల డాలర్ల వ్యక్తిగత సంపద కలిగిన మస్క్‌..త్వరలోనే ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా (లక్ష కోట్ల డాలర్లు=మన కరెన్సీలో రూ.96 లక్షల కోట్లు) అవతరించే అవకాశాలున్నాయి. అది ఎలాగంటారా..? ఆయనకు చెందిన అంతరిక్ష రాకెట్ల తయారీ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ ఈ నెలలోనే తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు రాబోతోంది. అందులో భాగంగా 55.56 కోట్ల షేర్లను ఒక్కొక్కటీ 135 డాలర్ల చొప్పున విక్రయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంటే, ఈ ఐపీఓ ద్వారా స్పేస్‌ఎక్స్‌ 7,500 డాలర్ల (సుమారు రూ.7.20 లక్షల కోట్లు) వరకు సమీకరించనుంది. ప్రపంచంలో ఇదే అత్యంత విలువైన ఐపీఓ కానుంది. అలాగే, ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా స్పేస్‌ఎక్స్‌ మార్కెట్‌ విలువ దాదాపు 1.77 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.170 లక్షల కోట్లు) చేరుకోనుండగా.. కంపెనీలో 82.4 శాతం ఓటింగ్‌ హక్కులు కలిగిన మస్క్‌ మొత్తం వ్యక్తిగత ఆస్తి లక్ష కోట్ల డాలర్లు దాటిపోయే అవకాశాలున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి

ప్రతి ఒక్కరూ రేపు సైకిల్‌ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు

Read Latest National News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 04:01 AM