Share News

ఆర్‌బీఐ పాలసీకి ముందు అప్రమత్తత

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:04 AM

రోజంతా లాభ, నష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటలకు లోనైన స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు.. చివరికి అతిస్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయు. గురువారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో...

ఆర్‌బీఐ పాలసీకి ముందు అప్రమత్తత

  • 737 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడిన సెన్సెక్స్‌

  • స్వల్ప లాభంతో ముగింపు

ముంబై: రోజంతా లాభ, నష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటలకు లోనైన స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు.. చివరికి అతిస్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయు. గురువారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 737 పాయింట్ల శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్‌.. కేవలం 13.84 పాయింట్ల లాభంతో 74,360.01 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 10.95 పాయింట్ల వృద్ధితో 23,416.55 వద్ద ముగిసింది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్ష నిర్ణయాలను శుక్రవారం ప్రకటించనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్త ధోరణితో వ్యవహరించడం ఇందుకు ప్రధాన కారణమైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ నేపథ్యంలో కొత్త పెట్టుబడుల విషయంలో మదుపరులు వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తున్నారని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్‌ఫఐఐ) బుధవారం రూ.5,616.56 కోట్లు, గురువారం రూ.4,447.06 కోట్ల నికర విక్రయాలు జరిపారు.

  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు పెరిగి రూ.95.74 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు పీపా ధర ఒకదశలో 2.5 శాతానికి పైగా తగ్గి 95.33 డాలర్లకు దిగివచ్చింది.

  • ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,60,300 పలకగా.. కిలో వెండి రూ.3,800 తగ్గుదలతో రూ.2,65,700కు దిగివచ్చింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 4,472 డాలర్లు, సిల్వర్‌ 73.56 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.


కుకు రూ.3,500 కోట్ల ఐపీఓ

జూఆడియో బుక్‌ ప్లాట్‌ఫామ్‌ కుకు ఎఫ్‌ఎం, షార్ట్‌ వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌ కుకు టీవీల నిర్వహణ సంస్థ కుకు టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు అనుమతి కోరుతూ క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. డీఆర్‌హెచ్‌పీలోని వివరాలు బయటికి వెల్లడించాల్సిన అవసరం లేకుండా కంపెనీ కాన్ఫిడెన్షియల్‌ ఫైలింగ్‌ మార్గాన్ని ఎంచుకుంది. అయితే, పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.2,500-3,500 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉందని ఈ వ్యవహారంపై అవగాహన కలిగిన వర్గాలు వెల్లడించాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి

ప్రతి ఒక్కరూ రేపు సైకిల్‌ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు

Read Latest National News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 04:04 AM