కీలక వడ్డీరేట్లు యథాతథం.. రెపో రేటులో ఎలాంటి మార్పు లేదన్న ఆర్బీఐ
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:36 AM
RBI కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రజ్యోతి, జూన్ 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ సవరించకపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం.
ఇంతకుముందు ఈ ఏడాది (2026) ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో జరిగిన ద్రవ్య పరపతి సమీక్షల్లోనూ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను మార్చకుండా ఇలాగే ఉంచింది. అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత, పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో దేశీయ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.