Share News

ఈ20 పెట్రోల్ వాడితే చిన్నపాటి రిపేర్లు రావచ్చు: నితిన్ గడ్కరీ

ABN , Publish Date - Jul 29 , 2026 | 09:36 PM

ఈ20 పెట్రోల్ వాడితే 2005 నుంచి 2016 మధ్య కాలంలో తయారైన బీఎస్-III (BS-III) పాత వాహనాల్లోని రబ్బర్ భాగాలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ20 పెట్రోల్ వాడితే చిన్నపాటి రిపేర్లు రావచ్చు: నితిన్ గడ్కరీ
BS-III vehicles

ఇంటర్‌నెట్ డెస్క్: ఈ20 పెట్రోల్ వాడితే 2005 నుంచి 2016 మధ్య కాలంలో తయారైన బీఎస్-III (BS-III) పాత వాహనాల్లోని రబ్బర్ భాగాలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనికి పరిష్కారంగా.. వాహనాల రెగ్యులర్ సర్వీసింగ్ సమయంలో కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు మార్చుకుంటే సరిపోతుందని తెలిపింది. ‘పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల పాత వాహనాల ఇంజిన్లు పాడవుతాయా? మైలేజీ తగ్గుతుందా?’ అని రాజ్యసభలో సీపీఐ ఎంపీ ఏఏ రహీమ్ అడిగిన ప్రశ్నకు మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.


ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్ మన్నిక, పనితీరు, మైలేజీపై పెద్దగా ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఐఓసీఎల్, ఏఆర్ఏఐ (ARAI) వంటి సంస్థల అధ్యయనాల్లో ఈ20 ఇంధన వినియోగంపై ఎలాంటి ఇంజిన్ మార్పులు అవసరం లేదని తేలిందన్నారు. దేశవ్యాప్తంగా అమలుకు ముందు నిర్వహించిన పరీక్షల్లో పాత వాహనాల పనితీరు.. లోహాలు, ప్లాస్టిక్ భాగాల అనుకూలత విషయంలో సమస్యలేవీ తలెత్తలేదని ఆయన వివరించారు.


ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్: భారత జూడో జట్టుకు షాక్.. గ్లాస్గోకు చేరని ప్లేయర్ల సామగ్రి!

ఆగస్టు 3లోగా 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి

Updated Date - Jul 29 , 2026 | 09:43 PM