Share News

మహిళపై సహోద్యోగుల గ్యాంగ్‌రేప్‌

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:12 AM

దేశ రాజధాని ఢిల్లీలో ఒక యువతిపై సహోద్యోగులే సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు

మహిళపై సహోద్యోగుల గ్యాంగ్‌రేప్‌
image

  • మహిళపై సహోద్యోగుల గ్యాంగ్‌రేప్‌

  • ఢిల్లీలోని ఓ కేఫ్‌లో దారుణం

  • సహకరించిన ఇద్దరు మహిళలు, మరొకరి అరెస్టు

  • మరో ముగ్గురి కోసం పోలీసుల గాలింపు

న్యూఢిల్లీ, నవంబరు 25: దేశ రాజధాని ఢిల్లీలో ఒక యువతిపై సహోద్యోగులే సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. తూర్పు ఢిల్లీలోని ప్రీత్‌ విహార్‌లో ఉన్న ఒక కేఫ్‌లో సోమవారం రాత్రి అందులో పనిచేస్తున్న ఉద్యోగులు విందు చేసుకున్నారు. రాత్రి 11.30 గంటలకు కేఫ్‌ను మూసివేసిన తర్వాత 8 మంది ఉద్యోగులు దానిని తిరిగి తెరిచి మందుపార్టీ చేసుకున్నారు. అతిగా మద్యం సేవించిన ఇద్దరు ఉద్యోగులు తమ సహోద్యోగుల్లో ఒక యువతి (22)పై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఆ బృందంలోని ఇద్దరు మహిళలు కూడా సహకరించారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరుగురిపై కేసు నమోదుచేసి.. ఆ ఇద్దరు మహిళలతోపాటు ఒక పురుషుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 05:10 AM