Share News

గడ్కరీపై డీప్‌ఫేక్‌లు తక్షణం తొలగించండి

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:07 AM

కేంద్ర రోడ్డు రవాణా మంత్రి గడ్కరీపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చిన అసభ్య అవమానకర, పరువు నష్టం కలిగించే డీప్‌ఫేక్‌ పోస్టులను..

గడ్కరీపై డీప్‌ఫేక్‌లు తక్షణం తొలగించండి

  • మెటా, ఎక్స్‌, గూగుల్‌కు బాంబే హైకోర్టు ఆదేశం

  • ఇథనాల్‌ విధానం పేరిట కేంద్ర

  • మంత్రిపై తప్పుడు ప్రచారం

  • aఅది అసభ్యం, అవమానకరం

  • బహిరంగ వేదిక లపై వీటికి చోటు లేదని వ్యాఖ్య

ముంబయి, ఆగస్టు 5: కేంద్ర రోడ్డు రవాణా మంత్రి గడ్కరీపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చిన అసభ్య అవమానకర, పరువు నష్టం కలిగించే డీప్‌ఫేక్‌ పోస్టులను వెంటనే తొలగించాలని బాంబే హైకోర్టు బుధవారం మెటా, ఎక్స్‌ కార్ప్‌, గూగుల్‌ ఎల్‌ఎల్‌సీలను ఆదేశించింది. గడ్కరీ దాఖలు చేసిన సివిల్‌ పరువు నష్టం దావాపై విచారణ జరిపిన జస్టిస్‌ ఆరిఫ్‌ డాక్టర్‌ ధర్మాసనం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ20 ఇథనాల్‌ మిశ్రమ పెట్రోల్‌ కార్యక్రమం ద్వారా గడ్కరీ, ఆయన కుటుంబం అక్రమ ప్రయోజనాలు పొందారంటూ ఏఐ సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్‌ వీడియోలు, మార్ఫింగ్‌ పోస్టులు వ్యాప్తిలోకి రావడంపై గడ్కరీ కోర్టును ఆశ్రయించారు. బాధితులు కోర్టుకు రాకుండానే ఇలాంటి కంటెంట్‌ను తొలగించే యంత్రాంగం మీవద్ద లేదా అని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘‘ఇంత సాంకేతికత చేతిలో ఉండి కూడా ట్రిగ్గర్లు ఏర్పాటు చేయలేరా? అభ్యంతరకర కంటెంట్‌ అప్‌లోడ్‌ కాగానే గుర్తించి తొలగించాలి’’ అని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Updated Date - Aug 06 , 2026 | 05:09 AM