Share News

రజనీకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. సోదాలు చేపట్టిన పోలీసులు

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:24 PM

ఇండియన్ సూపర్ స్టార్స్ రజినీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రజినీకాంత్, ధనుష్ ఇళ్ల దగ్గర సోదాలు నిర్వహిస్తున్నారు.

రజనీకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. సోదాలు చేపట్టిన పోలీసులు
Rajinikanth bomb threat

చెన్నై, ఏప్రిల్ 11: తమిళనాడులో బాంబు బెదిరింపులు తరచుగా కలకలం సృష్టిస్తున్నాయి. అది కూడా సెలెబ్రిటీలను టార్గెట్ చేసుకుని బాంబు బెదిరింపులు రావటం అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రతీ నెలా రాజకీయ, సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా, ఇండియన్ సూపర్ స్టార్స్ రజినీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రజినీకాంత్, ధనుష్ ఇళ్ల దగ్గర సోదాలు నిర్వహిస్తున్నారు.


గత ఏడాది కూడా..

గత ఏడాది అక్టోబర్ నెలలో చెన్నై పోయస్ గార్డెన్‌లో ఉన్న రజినీకాంత్, ధనుష్ ఇళ్లతో పాటు కీల్పాక్కంలో ఉన్న టీఎన్ సీసీ అధ్యక్షుడు సెల్వపెరుతంగై ఇంటిని పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు అక్టోబర్ 27వ తేదీన చెన్నైలోని డీజీపీ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్‌ని రంగంలోకి దింపారు.


రజినీకాంత్, ధనుష్, సెల్వపెరుతంగై ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ ఎలాంటి బాంబులు లేకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతకు కొన్ని రోజుల ముందు.. అక్టోబర్ 13వ తేదీన సీఎం స్టాలిన్, రజినీకాంత్ ఇళ్లకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

సమ్మర్‌లో రోజూ షూ వేసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి

ట్రెక్కింగ్‌కు వెళ్లి మిస్సింగ్.. 4 రోజుల తర్వాత శవమై తేలిన బాలిక..

Updated Date - Apr 11 , 2026 | 12:28 PM