Share News

మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. భారీ భద్రత మధ్య సమావేశాలు

ABN , Publish Date - Mar 12 , 2026 | 11:22 AM

ముంబైలోని విధాన్ భవన్‌లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్టారు. మెయిల్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు.

మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. భారీ భద్రత మధ్య సమావేశాలు
Mumbai Vidhan Bhavan bomb threat

ముంబై, మార్చి 12: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు రావటంతో తీవ్ర కలకలం చెలరేగింది. ముంబైలోని విధాన్ భవన్‌లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్టారు. మెయిల్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు. అసెంబ్లీలోని వారిని దూరంగా పంపించేశారు. బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసులు కూడా తనిఖీలు నిర్వహించారు. అసెంబ్లీలో ఎలాంటి బాంబు లేదని తేలింది. దర్యాప్తు అధికారులు బెదిరింపులకు పాల్పడ్డ వారికోసం అన్వేషిస్తున్నారు.


బాంబు బెదిరింపుల నేపథ్యంలో అసెంబ్లీలో సెక్యూరిటీ కట్టుదిట్టం అయింది. మీడియా, అసెంబ్లీ సిబ్బంది, సాధారణ జనానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. భారీ భద్రత మధ్య ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక, సైబర్ సెల్ అధికారులు ఆ మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందన్న దానిపై దృష్టి సారించారు. ఫోరెన్సిక్ నిపుణులు డిజిటిల్ ఫుట్‌ ఫ్రింట్స్ కోసం వెతుకుతున్నారు.


ఇక, ఈ సంఘటనపై మహారాష్ట్రం హోం మంత్రి పంకజ్ మాట్లాడుతూ.. ‘గురువారం ఉదయం 6.27 గంటలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. విధాన్ భవన్‌తో పాటు, బాంబే స్టాక్ ఎక్సైంజ్, హైకోర్టుకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ప్రాథమిక దర్యాప్తులో ఆ మెయిల్ ఫేక్ అని తేలింది. అధికారులు మెయిల్ పంపిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

ఆ పరీక్షా షెడ్యూల్‌పై సీబీఎస్ఈ క్లారిటీ.. ఆ వార్తలు ఫేక్ అని స్పష్టం

Updated Date - Mar 12 , 2026 | 11:58 AM