‘సావర్కర్‌కు నివాళి’ని నెహ్రూ అడ్డుకున్నారు!
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:55 AM
మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి...
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ వ్యాఖ్య
సావర్కర్ మరణానికి రెండేళ్ల ముందే నెహ్రూ అస్తమయం
న్యూఢిల్లీ, జూన్ 2: మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. వీడీ సావర్కర్ మరణించినప్పుడు పార్లమెంటులో ఆయనకు నివాళులు అర్పించకుండా నెహ్రూ అడ్డుకున్నారని సంతోష్ విమర్శించారు. సావర్కర్‌కు శ్రద్ధాంజలి ఘటించాలనే ప్రతిపాదనకు నెహ్రూ ఒప్పుకోలేదని పేర్కొన్నారు. అయితే సంతోష్ చేసిన ఈ విమర్శలు బూమరాంగ్ అయ్యాయి! నెహ్రూ మరణించిన రెండేళ్ల తర్వాత సావర్కర్ మృతిచెందారని, అలాంటప్పుడు సావర్కర్ నివాళుల ప్రతిపాదనను నెహ్రూ ఎలా అడ్డుకోగలరు? అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. నెహ్రూ 1964లో, సావర్కర్ 1966లో మృతిచెందారు. నెహ్రూ విషయంలో చరిత్రను వక్రీకరించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ కూడా సంతోష్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది.
Also Read:
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...
For More Latest News