Share News

44 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై బీజేపీ

ABN , Publish Date - Feb 12 , 2026 | 06:32 AM

సుమారు 44 ఏళ్ల తర్వాత ముంబై మేయర్‌ పీఠంపై బీజేపీ జెండా ఎగిరింది. బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) 78వ మేయర్‌గా ఆ పార్టీకి చెందిన రీతూ తావ్‌డే బుధవారం...

44 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై బీజేపీ

  • బీఎంసీ మేయర్‌గా రీతూ తావ్‌డే

ముంబై, ఫిబ్రవరి 11: సుమారు 44 ఏళ్ల తర్వాత ముంబై మేయర్‌ పీఠంపై బీజేపీ జెండా ఎగిరింది. బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) 78వ మేయర్‌గా ఆ పార్టీకి చెందిన రీతూ తావ్‌డే బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమలం పార్టీ మొదటిసారిగా 1982-83లో ఈ పదవిని దక్కించుకోగా, మళ్లీ ఇన్నేళ్లకు ఆ అవకాశం లభించింది. రీతూ తావ్‌డేతో పాటు శివసేన అభ్యర్థి సంజయ్‌ ఘాడీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో గత 25 ఏళ్లుగా ముంబై రాజకీయాలను శాసిస్తున్న ఠాక్రే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. జనవరి 15న జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో 227 సీట్లకు గాను బీజేపీ 89 స్థానాలను గెలుచుకోగా, మిత్రపక్షమైన శివసేన షిండే వర్గం 29 స్థానాలను దక్కించుకుంది. ఈక్రమంలో అధికార కూటమి మేజిక్‌ ఫిగర్‌ 114ను దాటి అధికారాన్ని చేజిక్కించుకుంది.

ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌‌కు బండి సంజయ్ సూటిప్రశ్న

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 06:32 AM