Share News

జెన్‌జీ కోసం బీజేపీ ప్రత్యేక టీం

ABN , Publish Date - Aug 23 , 2026 | 06:15 AM

యువతను ఆకర్షించేందుకు తాము రూపొందిస్తున్న జెన్‌జీ ప్రచార కార్యక్రమానికి నాయకత్వం వహించడానికి ప్రత్యేక టీంను బీజేపీ నియమించింది. ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌లో యువతతో...

జెన్‌జీ కోసం బీజేపీ ప్రత్యేక టీం

బృందంలో నబిన్‌, స్మృతీ ఇరానీ, తావ్డే

న్యూఢిల్లీ, ఆగస్టు 22: యువతను ఆకర్షించేందుకు తాము రూపొందిస్తున్న జెన్‌జీ ప్రచార కార్యక్రమానికి నాయకత్వం వహించడానికి ప్రత్యేక టీంను బీజేపీ నియమించింది. ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌లో యువతతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ప్రధాని మోదీ ఇటీవల తన మంత్రివర్గానికి సూచించిన నేపథ్యంలో ఈ ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ బృందంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌, జాతీయ ప్రధాన కార్యదర్శులు స్మృతీ ఇరానీ, వినోద్‌ తావ్డే, గుజరాత్‌ మంత్రి హర్ష్‌ సంఘ్వీ, ఛత్తీ్‌సగఢ్‌ మంత్రి ఓపీ చౌధరితో పాటు పలువురు నేతలు ఉన్నారు. ఇటీవల కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనల తర్వాత యువతరంపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి పెట్టింది. వారితో మరింత మమేకం అయ్యే ప్రయత్నాల్లో భాగంగా జెన్‌జీ కోసం కాషాయ పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనుంది. యువ ఓటర్లను ఆకర్షించేందుకు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఛత్రోం కి గూంజ్‌ (విద్యార్థుల ప్రతిధ్వని) పేరుతో ప్రతిపక్షాలు పలు రాష్ట్రాల్లో కార్యక్రమాలు మొదలుపెట్టాయి. దీంతో బీజేపీ కూడా యువతను ఆకర్షించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఈ కార్యక్రమాల ద్వారా జెన్‌జీ ఆకాంక్షలను తెలుసుకోనుంది. అలాగే బీజేపీ నేతలతో యువత నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయనుంది.

ఇవి కూడా చదవండి

ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

Updated Date - Aug 23 , 2026 | 06:20 AM