Share News

బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:55 AM

ప్రధాని మోదీ ప్రభుత్వాధినేతగా అధికారం చేపట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది....

బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌

మోదీ 25 ఏళ్ల అధికారానికి గుర్తుగా ప్రచార కార్యక్రమం

  • సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహణ

న్యూఢిల్లీ, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ప్రభుత్వాధినేతగా అధికారం చేపట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ పేరుతో మోదీ జన్మదినమైన సెప్టెంబరు17వ తేదీ నుంచి అక్టోబరు 17వ తేదీ వరకు నెలరోజులపాటు భిన్న ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ జాతీయ కార్యదర్శి వినోద్‌ తావ్డే వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం జాతీయ వర్క్‌షా్‌పను నిర్వహించారు. పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ కూడా తన కొత్త కార్యవర్గంతో ఢిల్లీలో శనివారం తొలిసారి సమావేశమయ్యారు. 65 మంది ఆఫీస్‌ బేరర్లతో కూడిన ఈ కార్యకవర్గ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. అనంతరం తావ్డే మీడియాతో మాట్లాడుతూ.. సేవా సంకల్ప్‌ అభియాన్‌ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ‘వచ్చే అక్టోబరు7వ తేదీతో ప్రభుత్వాధినేతగా అధికారం చేపట్టి మోదీ 25 ఏళ్లు పూర్తిచేసుకుంటున్నారు. 2001, అక్టోబరు 7న ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నెలపాటు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. దేశ సేవలో మోదీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ నెలపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం. అంగన్వాడీ సమ్మాన్‌, మాతృ సమ్మాన్‌ పేరుతో పార్టీ కార్యకర్తలు దేశంలోని 14 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలను కలిసి, వారి సేవలను ప్రశంసిస్తారు. యువతకు దగ్గరయ్యేలా సేవా మే యోగ్‌దాన్‌, రాష్ట్రీయ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తాం. సామాజిక సేవ ప్రాధాన్యాన్ని తెలిపేలా సేవా సేతు అభియాన్‌ పేరుతో సోషల్‌ మీడియాలో రీల్స్‌ ద్వారా ప్రచారం నిర్వహిస్తాం. ప్రజలు రీల్స్‌ను పోస్ట్‌ చేసేందుకు ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేస్తాం’’ అని వివరించారు.


వందేమాతరం పూర్తిగా పాడాల్సిందే

రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు వందేమాతర గే యాన్ని అగౌరవపరిస్తే సహించబోమని బీజేపీ హెచ్చరించింది. నితిన్‌ నబిన్‌ అధ్యక్షతన జరిగిన తొలి ఆఫీస్‌ బేరర్ల సమావేశంలో ఈ మేరకు 10 పాయింట్లతో కూడిన తీర్మానం చేశారు. వందేమాతర గేయం చరిత్ర, అర్థం, జాతీయ ప్రాధాన్యం గురించి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు నితిన్‌ నబిన్‌ చెప్పారు. వందేమాతరం పూర్తిగేయాన్ని పాడేలా మొత్తం దేశ యువతను సన్నద్ధం చేస్తామని తెలిపారు. వందేమాతరం మొదటి రెండు చరణాలే పాడాలన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయాన్ని ఈ సమావేశం ఖండించింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు నేతలు పాల్గొన్నారు. ేసవా సంకల్ప్‌ అభియాన్‌’ వర్క్‌షా్‌పలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ పాల్గొన్నారు. ప్రధాని మోదీ అద్భుత నాయకత్వానికి గుర్తుగా ేసవా సంకల్ప్‌ అభియాన్‌ పేరుతో చేపట్టాల్సిన ప్రచారం, సంస్థాగత కార్యకలాపాలపై చర్చింనినట్లు రాంచందర్‌రావు తెలిపారు.

ఆఫీస్‌ బేరర్లతో ప్రధాని భేటీ

నితిన్‌ నబిన్‌ అధ్యక్షతన జరిగిన ఆఫీస్‌ బేరర్ల సమావేశం అనంతరం ప్రధానమంత్రి మోదీ వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయన.. ఆ 65 మంది నేతలతో కొద్దిసేపు ముచ్చటించారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. పార్టీని ప్రజల కు.. ముఖ్యంగా యువతకు మరింత చేరువ చేసే అంశంపై దిశానిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి

ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

Updated Date - Aug 23 , 2026 | 05:55 AM