జమ్మూకశ్మీర్ సీఎంపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామంటూ నోటీసులు
ABN , Publish Date - Jul 13 , 2026 | 02:05 PM
రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిస్తూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు భారతీయ జనతా పార్టీ లీగల్ నోటీసు పంపింది.
రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిస్తూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు భారతీయ జనతా పార్టీ (BJP) లీగల్ నోటీసు పంపింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఒమర్ అబ్దుల్లా కొద్ది రోజుల క్రితం చేసిన ఆరోపణలే ఈ వివాదానికి కారణం (BJP legal notice to Omar Abdullah).
కొద్ది రోజుల క్రితం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, 'మా పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను బీజేపీ ప్రతినిధులు ప్రలోభపెట్టారు. రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు నగదు, మంత్రి పదవులు ఇస్తామని ఆశచూపారు. అలాగే తమ పార్టీలో జాయిన్ అయితే జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని చెప్పారు' అని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు 'ఆపరేషన్ లోటస్' తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు (Rs 100 crore defamation).
ఒమర్ అబ్దుల్లా ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది పేర్కొన్నారు (Jammu Kashmir politics). తమపై చేసిన ఆరోపణలకు వెంటనే ఆధారాలు చూపాలని, లేకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత బీజేపీ తరఫున ఒమర్ అబ్దుల్లాకు అధికారిక లీగల్ నోటీసు పంపారు. ఆరోపణలను నిరూపించలేకపోతే లేదా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆమిర్ ఖాన్ మూడో వివాహం లవ్ జిహాద్.. మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..