Share News

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని స్కూళ్లనే టార్గెట్‌ చేస్తున్న సీజేపీ

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:33 AM

సీజేపీతో విభేదించి కాక్రోచ్‌ జనతా పార్టీ- డెమోక్రటిక్‌ను స్థాపించిన సామాజిక వేత్త మనీశ్‌ బ్రహ్మభట్‌ సీజేపీపై తీవ్రస్థాయిలో...

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని స్కూళ్లనే టార్గెట్‌ చేస్తున్న సీజేపీ

ఆప్‌తో కుమ్మక్కైందంటూ బ్రహ్మభట్‌ ఆరోపణలు

ముంబై, సెప్టెంబరు 11: సీజేపీతో విభేదించి కాక్రోచ్‌ జనతా పార్టీ- డెమోక్రటిక్‌ను స్థాపించిన సామాజిక వేత్త మనీశ్‌ బ్రహ్మభట్‌ సీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పాఠశాలలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటోందని, ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌) పాలిత పంజాబ్‌లోని పాఠశాలలను మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముంబైలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీజేపీ నాయకులు కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ‘‘సీజేపీ బృందం ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ కార్యక్రమంలో భాగంగా జైపుర్‌లో శిథిలావస్థలో ఉన్న ఓ గ్రామీణ పాఠశాలను సందర్శించింది. పంజాబ్‌లో మాత్రం అన్ని వసతులు ఉన్న ఏఐ స్కూల్‌ను సందర్శించి ప్రచారం చేసుకుంద’’ని విమర్శించారు. సీజేపీ ‘స్కూల్‌ ఠీక్‌ కరో’కు బదులుగా ‘నేత ఠీక్‌ కరో’ ప్రచారాన్ని ప్రారంభించాలని, నాయకుడు మంచివాడైతే పాఠశాలలు కూడా బాగుపడతాయన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Updated Date - Sep 12 , 2026 | 06:33 AM