Share News

'వందేమాతరం'పై కీలక తీర్మానం.. ఆమోదం తెలిపిన బీజేపీ..

ABN , Publish Date - Aug 22 , 2026 | 05:52 PM

వందేమాతరం' గౌరవ ప్రతిష్ఠలను కాపాడటం కోసం ప్రవేశపెట్టిన కీలక తీర్మానానికి భారతీయ జనతా పార్టీ అమోదం తెలిపింది.

'వందేమాతరం'పై కీలక తీర్మానం.. ఆమోదం తెలిపిన బీజేపీ..
BJP Vande Mataram resolution

ఇంటర్‌నెట్ డెస్క్: 'వందేమాతరం' గౌరవ ప్రతిష్ఠలను కాపాడటం కోసం ప్రవేశపెట్టిన కీలక తీర్మానానికి భారతీయ జనతా పార్టీ అమోదం తెలిపింది. శనివారం జరిగిన బీజేపీ నూతన జాతీయ పదాధికారుల సమావేశంలో 10 పాయింట్ల‌తో ఈ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించింది. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది.


వందేమాతరం గేయంలోని తొలి 2 చరణాలను మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి 6 చరణాలను పాడి, వందేమాతరం గౌరవాన్ని కాపాడుతామని స్పష్టం చేసింది. 2026 పార్లమెంట్ చట్టాన్ని బీజేపీ సమర్థించింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు 'వందేమాతరం' బలికాదని తేల్చి చెప్పింది. 'వందేమాతరం' గౌరవ ప్రతిష్ఠలను కాపాడతామని బీజేపీ ప్రతిజ్ఞ చేసింది. దేశవ్యాప్తంగా 'వందేమాతరం' ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టింది.


ఇవి కూడా చదవండి

వైసీపీపై మంత్రి నారా లోకేశ్ ఫైర్.. టీడీపీ కేడర్‌కు కీలక సూచనలు

గృహ హింస, వరకట్న వేధింపుల కేసులో జోగి రమేశ్ కుటుంబానికి ఊరట..

Updated Date - Aug 22 , 2026 | 06:08 PM