‘నీట్’పై డాక్టర్స్ ఫ్రంట్‌ను అడ్డుకున్న బీజేపీ ఎంపీలు
ABN , Publish Date - Jun 02 , 2026 | 06:14 AM
నీట్ పేపర్ల లీకేజీపై విచారణ జరుపుతున్న పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సమాచారం ఇవ్వకుండా యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్స్ ప్రతినిధులను...
న్యూఢిల్లీ, జూన్ 1: నీట్ పేపర్ల లీకేజీపై విచారణ జరుపుతున్న పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సమాచారం ఇవ్వకుండా యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్స్ ప్రతినిధులను బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ కమిటీ సోమవారం పేపరు లీకేజీపై విచారణ జరిపింది. లీకేజీపై డాక్టర్స్ ఫ్రంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇందుకు సంబంధించి ప్రజెంటేషన్ ఇవ్వాలని ఆ సంఘాన్ని కమిటీ ఆహ్వానించింది. తీరా వచ్చే సరికి ఈ కమిటీలోని బీజేపీ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. దాంతో డాక్టర్స్ ఫ్రంట్ ప్రతినిధులు ఎలాంటి వివరాలు ఇవ్వలేకపోయారు. ఈ కమిటీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి పుణ్యసలిల శ్రీవాత్సవలను పిలిచి విచారణ జరిపింది.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం