Share News

కాంగ్రెస్‌కు ఏటీఎంలా తెలంగాణ

ABN , Publish Date - Jun 03 , 2026 | 06:08 AM

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు చేసిన సుదీర్ఘ ఆత్మగౌరవ పోరాటం, త్యాగం స్ఫూర్తిదాయకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ అన్నారు. లక్షలాది మంది...

కాంగ్రెస్‌కు ఏటీఎంలా తెలంగాణ

ఒక అవినీతి ప్రభుత్వం పోగానే.. మరో అవినీతి ప్రభుత్వం వచ్చింది.. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది

  • ఢిల్లీలో నిర్వహించిన తెలంగాణ అవతరణ వేడుకల్లో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

  • 12 ఏళ్లలో తెలంగాణకు 13 లక్షల కోట్లు: కిషన్‌రెడ్డి

  • తెలంగాణ పోరాటానికి బీజేపీ గొంతుక: రాంచందర్‌రావు

న్యూఢిల్లీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు చేసిన సుదీర్ఘ ఆత్మగౌరవ పోరాటం, త్యాగం స్ఫూర్తిదాయకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ అన్నారు. లక్షలాది మంది ప్రజల పోరాటాలు, త్యాగాల ఫలిత మే తెలంగాణ రాష్ట్రమని.. కానీ ఆ ఆకాంక్షలు, పోరాటాలు, త్యాగాలకు అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణను కొందరు ఏటీఎంలా వాడుకుంటున్నారని.. తెలంగాణ ప్రజల కష్టార్జితం ఈ రోజు కాంగ్రెస్‌ ఖజానాలోకి వెళుతోందని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందు లో నితిన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 1969లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసు కాల్పులు జరిపించి ఎంతో మంది యువకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. 1997లో కాకినాడలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలోనే ‘ఒక ఓటు - రెండు రాష్ట్రాలు’ తీర్మానాన్ని ఆమోదించామని గుర్తుచేశారు. గత 12 ఏళ్లలో మోదీ ప్రభు త్వం తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, కానీ రాష్ట్రంలోని పేద ప్రజలు ఆశించిన ప్రభుత్వాలు ఏర్పడలేదని.. ఒక అవినీతి ప్రభుత్వం పోగానే మరో అవినీతి ప్రభుత్వం వచ్చిందని ఆయ న వ్యాఖ్యానించారు.


తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ కాదని.. తెలంగాణ ప్రజలు ఆ పార్టీ మెడలు వంచి తెచ్చుకున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ఎప్పుడూ ఒకే మాట, ఒకే నినాదం, ఒకే లక్ష్యంతో తెలంగాణ కోసం పోరాడిందన్నారు. అప్పట్లో తెలంగాణ నుంచి ఒక్క బీజేపీ ఎంపీ లేకు న్నా దేశంలోని బీజేపీ ఎంపీలంతా రాష్ట్ర ఏర్పాటు కు మద్దతు పలికారని చెప్పారు. కేంద్రం గత 12 ఏళ్లలో తెలంగాణకు రూ.13 లక్షల కోట్ల నిధులను ఇచ్చిందన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు తీవ్ర అవినీతి, అహంకారంతో వ్యవహరించారని, రాష్ట్రాన్ని కుటుం బ సభ్యులకు దోచిపెట్టారని ఆరోపించారు. రేవంత్‌ ప్రభుత్వం అదే తరహాలో అవినీతి, అక్రమాలకు పా ల్పడుతోందని.. తెలంగాణ ప్రభుత్వాన్ని రియల్‌ ఎస్టేట్‌కు అడ్డాగా మార్చారని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం 1,200 మందికి పైగా యువత ప్రాణాలను త్యాగం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలకపాత్ర పోషించిందని.. లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌ బలంగా నిలబడకపోతే.. తెలంగాణ గొంతు అంత శక్తివంతంగా వినిపించేది కాదని పేర్కొన్నారు.

Also Read:

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

For More Latest News

Updated Date - Jun 03 , 2026 | 06:09 AM