Share News

రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు

ABN , Publish Date - Jun 05 , 2026 | 03:35 AM

రాజ్యసభలో బలం పెంచుకోవడమే లక్ష్యంగా గురువారం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల్లో...

రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు

న్యూఢిల్లీ, జూన్‌ 4: రాజ్యసభలో బలం పెంచుకోవడమే లక్ష్యంగా గురువారం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల్లో అన్ని స్థానాలను కూడా ఆ పార్టీయే దక్కించుకోనుంది. గుజరాత్‌లో నలుగురు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఇద్దరు చొప్పున అభ్యర్థులను నిలబెట్టనుంది. పంజాబ్‌కు చెందిన పార్టీ నాయకుడు తరుణ్‌ ఛుగ్‌ మధ్యప్రదేశ్‌ నుంచి పోటీ చేయనున్నారు. కేంద్రమంత్రులు రవనీత్‌ బిట్టు, జార్జ్‌ కురియన్‌ గతంలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల నుంచి గెలవగా ఈ సారి వారికి టిక్కెట్లు ఇవ్వలేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి

ప్రతి ఒక్కరూ రేపు సైకిల్‌ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు

Read Latest National News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 03:35 AM